Thursday, May 14, 2026

సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు

📰 Generate e-Paper Clip

నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో “నిజామాబాద్ ప్రీమియర్ లీగ్” జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీల ద్వారా ముఖ్యంగా యువకులకు మరియు ప్రజలకు సైబర్ సెక్యూరిటీ (Cyber Security), మాదక ద్రవ్యాల నిర్మూలన (Narcotics) మరియు ట్రాఫిక్ నిబంధనల (Traffic Awareness) పట్ల విస్తృత అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణ కోసం శ్రీ సాయి చైతన్య, IPS, NSC చైర్మన్‌గా, శ్రీ బస్వ రెడ్డి NSC కన్వినర్‌గా, మరియు శ్రీమతి కవిత రెడ్డి NSC జనరల్ సెక్రటరీగా ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కమిటీలో జాయింట్ సెక్రటరీలుగా శ్రీ కే. శ్రీనివాస్ రెడ్డి (స్పోర్ట్స్), Dr. కే. శిరీష్ కుమార్ (సైబర్ సెక్యూరిటీ), రజినీకాంత్ (ఫిజికల్ సెక్యూరిటీ) మరియు ట్రెజరర్‌గా శ్రీ కే. సంతోష్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రీడా పోటీలలో భాగంగా మొత్తం ఐదు రకాల ఆటల పోటీలను 1) వాలీబాల్, 2) బాస్కెట్ బాల్, 3) కబడ్డీ 4) యోగా 5) క్రికెట్ నిర్వహిస్తున్నారు.
వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ పోటీలు నిజామాబాద్‌లోని DSA మైదానంలో జరగనున్నాయి.

ఈ మూడు విభాగాలలో విజేతలకు మొదటి బహుమతిగా రూ. 20,000, రెండవ బహుమతిగా రూ. 10,000, మరియు మూడవ బహుమతిగా రూ. 5,000 అందజేయబడును. కబడ్డీ పోటీలు కేవలం పురుషులకు మాత్రమే పరిమితం.
యోగా పోటీలు సుభాష్ నగర్‌లోని కాకతీయ ఒలంపియాడ్ స్కూల్‌లో నిర్వహించబడతాయి. ఇందులో అండర్-14, అండర్-18 మరియు 18 ఏళ్లు పైబడిన బాలబాలికలకు మొత్తం 6 క్యాటగిరీలలో 18 బహుమతులు ఉంటాయి. యోగా విభాగంలో విజేతలకు మొదటి బహుమతిగా రూ. 3,000, రెండవ బహుమతిగా రూ. 2,000, మరియు మూడవ బహుమతిగా రూ. 1,000 అందజేయబడును.
క్రికెట్ పోటీలు కంటేశ్వర్‌లోని మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో 12 ఓవర్ల ఫార్మాట్‌లో హార్డ్ టెన్నిస్ బాల్‌తో నిర్వహించబడును. క్రికెట్ ఎంట్రీ ఫీజు రూ. 5,000 కాగా, కేవలం మొదట నమోదు చేసుకున్నటీములకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. క్రికెట్ విజేతలకు భారీ స్థాయిలో మొదటి బహుమతి రూ. 1,00,000 మరియు రన్నరప్‌కు రూ. 50,000 నగదు బహుమతి ప్రకటించారు. క్రికెట్ క్రీడాకారులు సొంతంగా తెలుపు ప్యాంట్, తెలుపు బూట్లు తెచ్చుకోవాలి, నిర్వాహకులు కేవలం టీ-షర్టులు మాత్రమే అందిస్తారు.
ఈ పోటీల్లో పాల్గొనదలచిన వారు తేదీ 11-04-2026 నుండి తేదీ 17.04.2026 సాయంత్రం 5:00 గంటల లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. పోటీలకు సంబంధించిన డ్రా 18-04-2026 మధ్యాహ్నం 2:00 గంటలకు తీయబడును. ఈ టోర్నమెంట్ కేవలం నిజామాబాద్ జిల్లా నివాసులకు మాత్రమే అవకాశం ఉండటంతో, క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ వెంట తీసుకురావాలి. యోగా పోటీదారులు వయస్సు ధృవీకరణ కోసం స్కూల్ బోనఫైడ్ లేదా SSC మెమో సమర్పించాల్సి ఉంటుంది. టోర్నమెంట్ సమన్వయకర్తలుగా జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ బి. పవన్ కుమార్ (9701177144) మరియు కబడ్డీ కోచ్ ప్రశాంత్ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలోని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.

క్రీడల యొక్క ఇన్చార్జి పేర్లు మరియు ఫోన్ నంబర్స్.
వాలీబాల్ – బి. మల్లేష్ గౌడ్ (9440711635).
బాస్కెట్ బాల్ -బి. నరేష్ (9440404424).
కబడ్డీ -ఎం. ప్రశాంత్ (9866770889)
యోగా – సంగీత (9848420803) గంగాధర్ (8074982200)
క్రికెట్ – సురేష్ కుమార్ – (9849202586), విక్రమ్ ( 9493309972)

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This