Sunday, June 28, 2026

రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షా శిక్షణ అభియాన్ –

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షా శిక్షణ అభియాన్ కార్యక్రమం… నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం బాలికల ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడింది.
ముగింపు కార్యక్రమంలో భాగంగా, నిజామాబాద్ జిల్లా సీనియర్ కరాటే మాస్టర్స్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి మరియు నోడల్ ఆఫీసర్ లను మర్యాదపూర్వకంగా శాలువతో సత్కరించారు.

ఈ సందర్భంగా కరాటే మాస్టర్స్ తమ సమస్యలను అధికారులు ముందుకు తీసుకువచ్చారు. వారి సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం ద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు, ఆత్మరక్షణపై అవగాహన కూడా విస్తరిస్తుందన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This