Friday, June 19, 2026

ఏటీఎంల వద్ద అపరిచితుల సహాయం తీసుకోవద్దు

📰 Generate e-Paper Clip

బాల్కొండ: ప్రజలు తమ అవసరాలకు ఏటీఎం నుండి డబ్బు డ్రా చేసుకునేటప్పుడు ఏటీఎం వద్ద అపరిచితుల సహాయము తీసుకోవద్దని బాల్కొండ ఎస్సై కే శైలేందర్ సూచించారు. ఆయన బాల్కొండ మండలంలోని పలు ఏటీఎంలను సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏటీఎం కస్టమర్లను అప్రమత్తం చేస్తూ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. డబ్బు డ్రా చేసుకొనే విషయంలో సహాయం చేస్తామని నమ్మిస్తారని, మీ దృష్టిని మళ్ళిస్తారని, ఏటీఎంలను మార్చుతారని, వాటితో డబ్బు డ్రా చేసుకుంటారని ఆయన వివరించారు. ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల గురించి 100 కు గాని, 8712659860,8712659756 నెంబర్లకు డయల్ చేయాలని ఆయన సూచించారు.

Must Read
- Advertisement -
Latest News

బాల్కొండ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

బాల్కొండ:  బాల్కొండ మండల కేంద్రం లో మండల అధ్యక్షులు సట్ల ప్రవీణ్ ఆధ్వర్యం లో టౌన్ ప్రెసిడెంట్ సంజీవ్ గౌడ్ లో ఆధ్వర్యంలో   శివాజీ చౌక్...

More Articles Like This