31.9 C
Hyderabad
Friday, September 25, 2026

బిచ్కుంద ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గూడ లక్ష్మినారాయణ సేవలు మరువలేనివి…

Must read

📰 Generate e-Paper Clip

బిచ్కుంద మండలంలోని బండా రెంజల్ ప్రాథమికోన్నత పాఠశాల హెడ్మాస్టర్ గూడ లక్ష్మినారాయణ ఈ నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా పాత బాన్సువాడలోని శ్రీ హనుమాన్ కళ్యాణ మండపంలో ఆత్మీయ బంధువులు,మిత్రులు, శ్రేయోభిలాషులందరి సమక్షంలో ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులను వేదికపైకి ఆహ్వానించి కండువా,పుష్పగుచ్ఛము, బ్యాడ్జీ,పెన్ను అందజేస్తూ ఆహ్వనించారు.తర్వాత జ్యోతి ప్రజ్వలన గావించారు.రిటైర్డ్ టీచర్ జింధం నరహరి రూపొందించిన సన్మాన-ఆనందవల్లి అనే సన్మాన పత్రాన్ని కామారెడ్డి జిల్లా పీఆర్టీయు అధ్యక్షులు కుషాల్ ఆవిష్కరించారు.బిచ్కుంద మండల పీఆర్టీయు అధ్యక్షులు సీమ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా పీఆర్టీయు బాన్సువాడ, బిచ్కుంద కార్యవర్గ సభ్యులు పీజీ హెడ్మాస్టర్లు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు ,ప్రధానోపాధ్యాయులు రిటైర్డ్ టీచర్లు, ఎంఈవోలు,గ్రామ మాజి సర్పంచ్, ఏఏపీసి చైర్ పర్సన్,పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొని ఉపాధ్యాయుడిగా అంకితభవంతో పనిచేశారని ఉద్యోగ విరమణ పొందుతున్న గూడ లక్ష్మినారాయణ – రత్నమాల దంపతులను శాలువాలు,పూలమాలలతో సత్కరించి,అతిపెద్ద ఫోటో జ్ఞాపికలు,నూతన వస్త్రాలు,బ్రాస్లైట్లు,బంగారు ఉంగరాలు బహుకరించి వారి సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి కామారెడ్డి జిల్లా పీఆర్టీయు అధ్యక్షులు కుశాల్ మాట్లాడుతూ సన్మాన గ్రహీత గూడ లక్ష్మినారాయణ ఆదిలాబాద్,నిజామాబాద్ జిల్లాల డీఎస్సీలలో అపాయింట్మెంట్ చేయబడి రెండు డిపార్ట్మెంట్లలో ఉపాధ్యాయుడిగా వార్డన్ గా హాస్టల్లలో డ్యూటీలు చేశారని, అలాగే బీర్కూర్ ఎంఈవో కార్యాలయంలో డిప్యూటేషన్ పై పనిచేసి తన అమూల్య సేవలందించారని అందమైన దస్తూరి గల లక్ష్మినారాయణ సర్వీస్ బుక్కులు వ్రాస్తూ పీఆర్టీయు ఉపాధ్యాయులకు నాయకులకు అండదండగా నిలుస్తూ క్రియాశీలక కార్యకర్తగా పీఆర్టీయు అభిమానిగా తన 37 వసంతాల ఉపాధ్యాయ వృత్తి ప్రస్థానాన్ని ఈ నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ పొందబోతున్నారని దంపతుల శేషజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో అనునిత్యం ఆనందమయంగా గడవాలని ఆకాంక్షిస్తూ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.

సన్మాన గ్రహిత గూడ లక్ష్మినారాయణ మాట్లాడుతూ తాను ఎక్కడ పని చేసినా విద్యార్థుల హృదిలో తల్లిదండ్రుల మదిలో గ్రామస్తుల సహోపాధ్యాయుల సహకారంతో పాఠశాల పరిపాలన నిర్వహణతో విద్యారంగంలో రాణించానని అన్నారు.తన పనితనాన్ని గుర్తించి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చారన్నారు.నా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా సీమ శ్రీనివాస్,జింధం నరహరి వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సుభాష్,బండా రెంజల్ పాఠశాల సహోపాధ్యాయులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.