బాల్కొండ : జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న రైతు సైకిల్ యాత్ర శనివారం రోజున బాల్కొండ మండల కేంద్రానికి చేరుకుంటున్నదని బాల్కొండ మండల బిజెపి అధ్యక్షుడు అంబటి నవీన్ తెలిపారు.ఈ సందర్బంగా మండల బీజేపీ మరియు కిసాన్ మోర్చా అన్ని మోర్చలు మరియు రైతులు కార్యకర్తలు పెద్దమ్మ ఆలయం వద్దకు ఉదయం 10 గం, లకు చేసుకోగలరని ఆయన తెలిపారు. బాల్కొండ NH44 ఆర్మూర్ రూట్ లో గల పెద్దమ్మతల్లి ఆలయం వద్ద నుండి సైకిల్ ర్యాలీ గ్రామం లోని శివాజీ చౌక్ వద్దకు చేరుకుంటుందని ఆయన తెలిపారు.. ఈ కార్యక్రమం లో బాల్కొండ ఇంచార్జ్ డా, ఏలేటి మల్లికార్జున్ రెడ్డి , పసుపు బోర్డు జాతీయ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి మరియు రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి లు పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆయన కోరారు.




