బిచ్కుంద ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గూడ లక్ష్మినారాయణ సేవలు మరువలేనివి…

బిచ్కుంద మండలంలోని బండా రెంజల్ ప్రాథమికోన్నత పాఠశాల హెడ్మాస్టర్ గూడ లక్ష్మినారాయణ ఈ నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా పాత బాన్సువాడలోని శ్రీ హనుమాన్ కళ్యాణ మండపంలో ఆత్మీయ బంధువులు,మిత్రులు, శ్రేయోభిలాషులందరి సమక్షంలో ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులను వేదికపైకి ఆహ్వానించి కండువా,పుష్పగుచ్ఛము, బ్యాడ్జీ,పెన్ను అందజేస్తూ ఆహ్వనించారు.తర్వాత జ్యోతి ప్రజ్వలన గావించారు.రిటైర్డ్ టీచర్ జింధం నరహరి రూపొందించిన సన్మాన-ఆనందవల్లి అనే సన్మాన పత్రాన్ని కామారెడ్డి జిల్లా పీఆర్టీయు అధ్యక్షులు కుషాల్ ఆవిష్కరించారు.బిచ్కుంద మండల పీఆర్టీయు అధ్యక్షులు సీమ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా పీఆర్టీయు బాన్సువాడ, బిచ్కుంద కార్యవర్గ సభ్యులు పీజీ హెడ్మాస్టర్లు, వివిధ...