31.9 C
Hyderabad
Friday, September 25, 2026

ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘంలో రాఖీ పౌర్ణమి వేడుకలు…

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర గల మార్కండేయ మందిరం ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘ భవనంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 8 తర్పల అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులు సలహాదారులందరి సమక్షంలో పూజారి వేదమంత్రోచ్ఛరణల మధ్య యజ్ఞము,హోమము,యజ్ఞోపవీత ధరణ,పట్టణ అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డలు ఒకరికొకరు రక్షాబంధన్ (నేను నీకు తోడు నీవు నాకు తోడు మనమిద్దరం పద్మశాలి వంశ ప్రతిష్టకు తోడునీడగా ఉందామని…) చేసుకునే ఈ పవిత్రమైన దినాన్ని మార్కండేయ వంశ పరంపరలు సంప్రదాయబద్ధంగా యజ్ఞోపవీత (పవిత్రమైన దారపు పోగులు) ధారణ చేసుకుని పవిత్రతకు నాందిగా నియమనిష్టలకు వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం నిర్వహించుకుంటామన్నారు.

పద్మశాలీలు ఐక్యతతో బలపడిననాడే రాజ్యాధికారం దక్కుతుందని,పేద గొప్ప తేడా లేని ఈ దినం మార్కండేయ వంశస్తుల గోత్రనామాలతో సకల పద్మశాలి కుటుంబాల జీవితాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లాలని,ఆ మార్కండేయుని కరుణ కటాక్షాలు మనందరిపై ఉండాలని,ప్రతి ఇంట్లో ఆనందం వెల్లివిరియాలని,కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని,ఆ మార్కండేయని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు బిజ్జు దత్తాద్రి,సలహాదారులు చిట్ల ప్రకాష్,అంబల్ల శ్రీనివాస్,మ్యాక గంగాధర్,తర్ప సంఘాల అధ్యక్షులు కృష్ణ హరి,అనంత్ రావు,చిట్ల యగ్నేష్,రుద్ర రాజేశ్వర్,ఆడెపు ప్రభాకర్,కురికెల్ల ఆత్మచరణ్,సదుమస్తుల గణపతి,బొడ్డు రాజు,కార్యవర్గ సభ్యులు జింధం నరహరి,బొడ్డు సాగర్,పట్టణ పద్మశాలి కుల బాంధవులు ఈఆర్ ఫౌండేషన్ ఈరవత్రి రాజశేఖర్ నూకల శేఖర్,గెంట్యాల గణేష్,అంబల్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.