నందిపేట్ మండల కేంద్రంలోని రైతు భవన్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.వన్నెల్(కే)కు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీజేపి వన్నెల్(కే) గ్రామ కమిటీ అధ్యక్షులు రాయికంటి భరత్ రెడ్డి పాల్గొని,ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల బీజేపి కార్యకర్తలు,వివిధ గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు.
నందిపేట్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..




