Sunday, June 21, 2026

సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన పెంచుకోవాలి

📰 Generate e-Paper Clip

బాల్కొండ: మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌, సైబర్‌ నేరాల నియంత్రణకు  విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఆర్మూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి అన్నారు. బాల్కొండ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్‌, మత్తు మందులు, గుట్కాలు, ప్రమాదకరమన్నారు. విద్యార్థులు ఇంటర్‌నెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని, సైబర్‌ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. బ్యాంక్‌ ఖాతా, ఏటీఎం పిన్‌ నెంబర్లు, ఓటీపీ వివరాలు చెప్పవద్దన్నారు. ఆశ చూపిస్తే వాటికి ఆకర్షితులు కావొద్దన్నారు.సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1930 కి కాల్‌ చేయాలన్నారు. వ్యక్తిగత ఫొటోలను డీపీలుగా పెట్టుకోవద్దన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేనివారు డ్రైవింగ్‌ చేయవద్దన్నారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా ఉపాధ్యాయులకు గాని ప్రధానోపాధ్యాయులకు తెలియజేయాలన్నారు. మాదకద్రవ్యాలను వినియోగించే వారి పట్ల సహకరించే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ    సందర్భంగా మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ శైలేందర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి విద్యార్ధి గా  ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు , కేవలం చదువు వలన ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని అన్నారు , చదువుకు ధనిక, బీద, తారతమ్యాలు లేవని, ఆయన అన్నారు.  ప్రాణాంతకమైన మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వ్యక్తిగత జీవితాన్ని కుటుంబాన్ని, భవిష్యత్‌ను నాశనం చేస్తాయన్నారు. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల వలలో చిక్కు కొకుండా జాగ్రత్త పడాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాల ను ఎంచుకొని క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్ ., వేల్పూర్ శ్రీనివాస్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మార్కండేయ మందిరాన్ని సందర్శించిన దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని అత్యంత పురాతనమైన శతాబ్దాల క్రితము స్థాపితమైన మార్కండేయ మందిరం పునర్నిర్మాణ పనులు చేపట్టడానికి అవసరమైన ఎస్టిమేట్, తదితర లాంచన కార్యక్రమాలను...

More Articles Like This