మెండోరా : తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండల విద్యాధికారులు (ఎంఈవోలు) ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల కోసం పురుష అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సమాచారం.
ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు నిర్దేశించిన విద్యార్హతలు కలిగిన పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు.
పూర్తి వివరాలు, దరఖాస్తు నమూనాలు మరియు విధివిధానాలు ఆయా మండల విద్యా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.


