సాధారణంగా పెళ్లి రోజు వచ్చిందంటే ఇంత కేక్ కట్ చేయడం… మరి కాస్త ముందుకెళ్లి నిరుపేదలకు పండ్లు పలహారాలు పంచి పెట్టడం చేస్తుంటారు… కానీ బాల్కొండ కి చెందిన ఈ దంపతులు తమ పెళ్లిరోజున ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ ముక్కంటి సేవలో తరించారు… బాల్కొండ మండల కేంద్రంలోని బ్రహ్మసూత్ర శివాలయం, నరనారాయణడు, మార్కండేయ మందిరం పునర్నిర్మాణ పనులు ముందుకు సాగే కార్యక్రమంలో అనేకమంది విరివిగా విరాళాలు అందించడానికి ముందుకు వస్తున్నారు… ఈ నేపథ్యంలో బాల్కొండకు చెందిన శ్రీ అంగూర్ లక్ష్మి మల్లేశ్వర్ లు తమ పెళ్లిరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో విచ్చేసి మందిర పునర్నిర్మాణానికి తమ తరపున 1,11,116/( 1లక్ష 11 వేల 1 వంద పదహారు ) విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మి మల్లేశ్వర్ లతోపాటు వారి కుటుంబ సభ్యులను బాల్కొండ పద్మశాలి సంఘం అధ్యక్షులు వెంకటగిరి, ఉపాధ్యక్షుడు భూసరత్నాకర్, కోశాధికారి కుందారపు శ్రీనివాస్ లు అభినందించారు.



