సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన పెంచుకోవాలి

బాల్కొండ: మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌, సైబర్‌ నేరాల నియంత్రణకు  విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఆర్మూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి అన్నారు. బాల్కొండ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్‌, మత్తు మందులు, గుట్కాలు, ప్రమాదకరమన్నారు. విద్యార్థులు ఇంటర్‌నెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని, సైబర్‌ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. బ్యాంక్‌ ఖాతా, ఏటీఎం పిన్‌ నెంబర్లు, ఓటీపీ వివరాలు చెప్పవద్దన్నారు. ఆశ చూపిస్తే వాటికి ఆకర్షితులు కావొద్దన్నారు.సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1930 కి కాల్‌ చేయాలన్నారు. వ్యక్తిగత ఫొటోలను డీపీలుగా పెట్టుకోవద్దన్నారు. డ్రైవింగ్‌...