Sunday, June 28, 2026

కవిత ‘పాంచజన్యం’కు బడ్జెట్ స్కూల్ అసోసియేషన్ మద్దతు

📰 Generate e-Paper Clip

నిజామాబాద్,: కల్వకుంట్ల కవిత నూతన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రకటించిన ‘పాంచజన్యం’ అజెండాపై విద్యా వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఉచిత విద్యను అందిస్తామన్న ప్రతిపాదనను నిజామాబాద్ జిల్లా బడ్జెట్ స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులు సాదరంగా ఆహ్వానించారు.ఆర్థిక  ఇబ్బందులతో సతమతమవుతున్న పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే అవకాశం కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం చిన్న పాఠశాలలకు (Budget Schools) అండగా ఉంటూ ఈ విధానాన్ని అమలు చేస్తే.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, పాఠశాలల మనుగడకు భరోసా లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. కవిత గారి విప్లవాత్మక ఆలోచనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అసోసియేషన్ ప్రతినిధులు బడ్జెట్ స్కూల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ షఫీ జిల్లా అధ్యక్షులు S.N.గిరి కార్యదర్శి మిసిమి రవీందర్ కోశాధికారి జువ్వి హరీష్ బాల్కొండ మండల సెక్రటరీ భూస రత్నాకర్ తెలిపారు

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This