వేల్పూర్: వేల్పూర్ మండల మోతె గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు విడిసి ఆధ్వర్యంలో నిర్వహించిన నిహా మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ భీంగల్ వారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల వైద్య నిపుణులు ఎంవీ.రెడ్డి ,జనరల్ ఫిజిషియాన్ సందీప్ కుమార్ రోగులకు ఉచితంగా రక్త.బీపీ. షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.సుమారుగా 146 మంది రోగులు పాల్గొనడం వలన వైద్య శిబిరం విజయవంతం కావడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ దొల్ల రమేష్,ఉప సర్పంచ్ కర్రోల్ల పరంజ్యోతి కుమార్ నిహా హాస్పిటల్ మానేజ్మెంట్ క్రాంతి, శేఖర్ మరియు వారి బృందం సన్మానించడం జరిగింది.



