Sunday, June 28, 2026

ది జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేతకు ఘన సన్మానం…

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో ఇంటర్ వరకు రెసిడెన్షియల్ విద్యను అందిస్తున్న, ది జైన్ ఇంటర్నేషనల్ స్కూలుకు ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అందుకున్న స్కూల్ డైరెక్టర్ శ్రీ యార్లగడ్డ దక్షిణామూర్తిని విశ్వతేజస్ సంస్థ నిజామాబాద్ కార్యాలయంలో జాదూ యుగంధర్ రంగనాథ్ నేతృత్వంలో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, కౌన్సిలింగ్ సైకాలజీ శ్రీ తిరునగరి శ్రీహరి గారితో పాటు, రిటైర్డ్ గజిటెడ్ హెడ్ మాస్టర్ శ్రీ కుంట జనార్దన్ గౌడ్ విశ్వతేజ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం దక్షిణామూర్తి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్కూల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఉన్నారని, ఇంటర్ వరకు సిబిఎస్ సిలబస్ తో ఉత్తమ విద్యను అందిస్తున్నామని, రాష్ట్రస్థాయిలో అవార్డు అందుకోవడం నిజామాబాద్ జిల్లా వాసిగా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను అన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This