Thursday, May 14, 2026

850కి చేరనున్న లోక్ సభ సీట్లు… 18, 19 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

📰 Generate e-Paper Clip

దేశములో ప్రతి ఒక్కరు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కొత్త నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది . లోక్ సభలో ప్రస్తుతం ఉన్న 543 సీట్లను 850కి పెంచడంతో పాటు మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్రం ఈరోజు మార్గం సుగమం చేసింది. ఈ మేరకు ఇదే నెల  18, 19 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి బిల్లుల్ని ఆమోదిస్తారు. ఈ మేరకు గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడంతో పాటు, కొత్త నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు కూడా ఇది మార్గం సుగమం చేస్తూ ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు పంపింది.
ఈ మేరకు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు ఉన్న 33 శాతం కోటాకు సంబంధించిన నిబంధనలను సవరించడానికి,  2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి రెండు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ ప్లాన్ ప్రకారం రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించారు. దీంతో లోక్ సభలో మొత్తం సీట్ల సంఖ్య 850కి చేరుతుంది. ఈ మార్పులు 2029 లోక్‌సభ ఎన్నికల నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This