850కి చేరనున్న లోక్ సభ సీట్లు… 18, 19 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

దేశములో ప్రతి ఒక్కరు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కొత్త నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది . లోక్ సభలో ప్రస్తుతం ఉన్న 543 సీట్లను 850కి పెంచడంతో పాటు మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్రం ఈరోజు మార్గం సుగమం చేసింది. ఈ మేరకు ఇదే నెల  18, 19 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి బిల్లుల్ని ఆమోదిస్తారు. ఈ మేరకు గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడంతో పాటు, కొత్త నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు కూడా ఇది మార్గం సుగమం చేస్తూ ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు...