Sunday, June 28, 2026

మొక్కజొన్న రైతులకు తీపి కబురు అందించిన సునీల్ రెడ్డి 

📰 Generate e-Paper Clip

బాల్కొండ: ఆరుగాలం కష్టించి దళారుల బారిన రైతులు పడకుండా వారిని తక్షణమే ఆదుకునేలా ప్రభుత్వం చేత మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాలని వ్యవసాయ శాఖ మంత్రిని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ సెగ్మెంట్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి కలిసి విన్నవించారు. మొక్కజొన్న పంటకు రైతుకు దళారులు కలిగించే నష్టాన్ని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సునీల్ రెడ్డి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న మంత్రి ఆదేశం మేరకు అధికారులు సోమవారం నుండి జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు ప్రారంభిస్తారని సునీల్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఎన్నికల్లో ఓటమి చెందిన రైతు పక్షాన ముందు వరుసలో ఉండే సునీల్ రెడ్డిని పలువురు రైతులు అభినందిస్తున్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This