బాల్కొండ: బాల్కొండ మండలకేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయన్ని మరియు కస్తూరిబా వసతి గృహాన్ని సోమవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు మండల విద్యాశాఖాధికారి బట్టు రాజేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భోజన నాణ్యత, వంటగది పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, వసతులను పరిశీలించారు మెనూ ప్రకారము అల్పాహారము భోజనాన్ని అందించడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. పదవ తరగతి విద్యార్థులు జరగబోయే మిగతా పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సూచించారు
తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...