బాల్కొండ గుట్టమీద వీరాంజనేయ గుడి ముందర అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని బాల్కొండ బీజేపీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సర్పంచ్, ఈఓ లకు వినతి పత్రం ఇచ్చారు.బాల్కొండ లోని గుట్టమీద హనుమాన్ గుడి ముందు ఉన్న స్థలం లో ఒక వర్గం వారు అక్రమ నిర్మాణం చేపట్టినారు.ఎటువంటి అధికారిక పర్మిషన్లు లేకుండానే వారి ఇష్టారాజ్యం గా పనులు ప్రారంభించారు. ఆ స్థలం యొక్క డాక్యూమెంట్స్ క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్య తీసికోగలరు. పర్మిషన్ లేకుండా అట్టి స్థలం లో ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా అడ్డుకోగలరని గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు సెక్రటరీ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో బీజేపీ మం, ఉపాధ్యక్షులు కాల రవి, బూసం సత్యనారాయణ, ఐటీ సెల్ మం కన్వినర్ కొత్తింటి రాకేష్, బీజేవైఎం మం, ప్రధానకార్యదర్శి ఆరెపల్లి రవీందర్, మండల నాయకులు సుంకం శ్రీనివాస్, ఉట్నూర్ రాంకిషన్, తోపారం అశోక్, లింగం లు పాల్గొన్నారు.



