నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన అడిషనల్ డీ. సీ. పి శుభమ్ ప్రకాష్ ని ఆర్మూర్ పట్టణ జాతీయ అవార్డు గ్రహీత సామాజిక సేవకులు పట్వారి తులసి కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి, పట్వారీ తులసి రూపొందించిన స్వాతంత్ర్య దేశ భక్తుల కథనాల అంశాల పుస్తకం మరియు యువత నైపుణ్యాల పుస్తకాన్ని శుభం ప్రకాష్ కు అందజేశారు.ఈ సందర్భంగా డీసీపి మాట్లాడుతూ పట్వారి తులసి సేవలు యువతకు మార్గదర్శకత్వం అని ముఖ్యంగా రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలన, హెల్మెట్ ప్రాముఖ్యత వివిధ సేవలను అభినందిస్తూ…మా వంతు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


