Friday, May 22, 2026

ఆర్మూర్ లో విశ్రాంత ఉద్యోగుల ద్వితీయ కార్యవర్గ సమావేశం…

📰 Generate e-Paper Clip

ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెన్షనర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు, జిల్లా కార్యదర్శి కరుణాసాగర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పుష్పకర్ రావు,యూనిట్ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్,ఆర్థిక కార్యదర్శి నవజీవన్,గౌరవాధ్యక్షులు రాం రెడ్డి పాల్గొన్నారు.యూనిట్ కార్యదర్శి జ్ఞానేశ్వర్ కార్యదర్శి నివేదికను చదివి వినిపించారు.ఆర్థిక కార్యదర్శి నవజీవన్ ఆర్థిక నివేదికను చదివి వినిపించారు.హాజరైన సభ్యుల చప్పట్లతో రెండు నివేదికలను ఆమోదించడం జరిగింది.

ఈ సందర్భంగా సభాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నామన్నారు.ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగులు సంఘ సభ్యత్వాన్ని తీసుకోవాలని పెన్షనర్స్ ప్రతి విషయంలో సంఘం సహకారం ఉంటుందని,ఆర్మూర్లో ప్రతీ నెలా ఐ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని,పెన్షనర్స్ జన్మదినోత్సవ వేడుకలు,పెన్షన్ నిలుపుదల చేయబడిన వారి బిల్లులు,అంత్యక్రియల బిల్లులు ఇప్పించడం.జీవన ప్రమాణ పత్రాన్ని ఆఫీసులోనే అందరికీ అందుబాటులో నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈహెచ్ ఎస్ కార్డులు ఈ నెల 31 వరకు సబ్మిట్ చేయవలసి ఉన్నందున సభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సబ్మిట్ చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు లు మాట్లాడుతూ సంఘం పది కాలాలపాటు చిరస్థాయిగా నిలవాలంటే సభ్యులు ఐకమత్యంగా ఉంటే దేనినైనా సాధించవచ్చన్నారు.ఐక్యతతో ఇలాగే కార్యక్రమాలు నిర్వహిద్దామని, ఈ హెచ్ ఎస్ కార్డుల సమాచారం సేకరణ విషయంలో సభ్యులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు.ప్రభుత్వ పరంగా మనకు రావలసిన పీఆర్సీ,ఈ.హెచ్.ఎస్ కార్డులు,డి.ఏ లను తక్షణం విడుదల చేయించడానికి కృషి చేద్దామన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ యూనిట్ కార్యవర్గ సభ్యులు అసోసియేట్ అధ్యక్షులు గంగారెడ్డి,ఉపాధ్యక్షులు కోటేశ్వర్,సుధాకర్,సహాయ కార్యదర్శి గంగాధర్,ఆర్గనైజింగ్ సెక్రటరీ హరి నారాయణ,పబ్లిసిటీ సెక్రటరీ జింధం నరహరి,జిల్లా కౌన్సిలర్లు ఎం సి ఓబన్న,దశరథ్,భూమన్న, ఆడిటర్స్ ముత్తన్న, సుదర్శన్, గేమ్స్ సెక్రటరీ కరాటే భోజన్న తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

అడిషనల్ డీసీపి శుభం ప్రకాష్ ను కలిసిన సమాజ సేవకుడు పట్వారి తులసి కుమార్

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన అడిషనల్ డీ. సీ. పి శుభమ్ ప్రకాష్ ని ఆర్మూర్ పట్టణ జాతీయ...

More Articles Like This