రాజకీయాల్లో తనదైన సేవా కార్యక్రమాలతో, అభివృద్ధి పనులతో వేల్పూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన రంగు అనిల్ గౌడ్ అంచెలంచెలుగా ఎదిగారు. వేల్పూర్ మండలంలోని సాహెబ్ పేట్ గ్రామ సర్పంచ్ గా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.అనేక సేవా కార్యక్రమాలతో అందరికి అందుబాటులో ఉంటూ తనకంటూ ప్రత్యేకతను చాటు కొన్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి , రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి ల అండదండలతో నియమితులయ్యారు. ఆయన నియామకం పట్ల పలువురు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


