Thursday, May 14, 2026

ఆధ్యాత్మిక సమ సమాజ దినోత్సవంగా జగద్గురు భగవత్ రామానుజుల జయంతి వేడుకలు…

📰 Generate e-Paper Clip


ఆర్మూర్: బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ నచికేతన్ విద్యా నికేతన్లో జగద్గురువులు భగవత్ రామానుజుల జయంతిని పురస్కరించుకొని శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి ( శ్వాస్) అధ్వర్యంలో బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ లో ఉన్న నిరుపేద విద్యార్థుల యొక్క శ్రీ నచికేత ఆవాసము- సేవా భారతి కు చెందిన నిరుపేద ఆశ్రమ విద్యార్థులకు 25 కిలోల బియ్యం సంచిని వితరణగా అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా గోవర్ధనం వెంకటాచార్యులు మాట్లాడుతూ  కలికల్మషాన్ని తొలగించి జగత్తును కాపాడడానికే అవతరించిన ఆదిశేషావతారమే జగద్గురువులు భగవత్ రామానుజులు.భగవంతుని నామాన్ని ఉచ్చరించడానికి అందరికీ అధికారం ఉంటుందని అందరినీ దేవుని బిడ్డలుగా ప్రేమించాలని ప్రేమను పంచాలని భగవత్ రామానుజులు భావించారు.తన తోటి వారి బాధను తన బాధగా భావించి మాధవ సేవగా సర్వ ప్రాణులను సేవించాలని అప్పుడే భగవత్ రామానుజుల జయంతికి పరమార్థం అన్నారు.సమాజంలో అందరూ స్వీయ ఆరాధన సర్వ ఆదరణతో కలిసిమెలిసి జీవించడమే భగవత్ రామానుజుల వారికి ఇచ్చే నిజమైన కానుక అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ ఉ. వే. శ్రీమాన్ గోవర్ధనం సుదర్శనాచార్యులు మరియు శ్రీ నచికేత ఆవాస ప్రముఖ్ శ్రీ గోరకనాథ్, ఆవాస ఉపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This