ఆధ్యాత్మిక సమ సమాజ దినోత్సవంగా జగద్గురు భగవత్ రామానుజుల జయంతి వేడుకలు…
ఆర్మూర్: బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ నచికేతన్ విద్యా నికేతన్లో జగద్గురువులు భగవత్ రామానుజుల జయంతిని పురస్కరించుకొని శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి ( శ్వాస్) అధ్వర్యంలో బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ లో ఉన్న నిరుపేద విద్యార్థుల యొక్క శ్రీ నచికేత ఆవాసము- సేవా భారతి కు చెందిన నిరుపేద ఆశ్రమ విద్యార్థులకు 25 కిలోల బియ్యం సంచిని వితరణగా అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా గోవర్ధనం వెంకటాచార్యులు మాట్లాడుతూ కలికల్మషాన్ని తొలగించి జగత్తును కాపాడడానికే అవతరించిన ఆదిశేషావతారమే జగద్గురువులు భగవత్ రామానుజులు.భగవంతుని నామాన్ని ఉచ్చరించడానికి అందరికీ అధికారం ఉంటుందని అందరినీ దేవుని బిడ్డలుగా ప్రేమించాలని ప్రేమను...