26.7 C
Hyderabad
Tuesday, September 22, 2026

గో విజ్ఞాన పరీక్షలకు అపూర్వ స్పందన-2500 కు పుస్తకాల పైగా పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ :మన గోవులు, మన సంస్కృతి మరియు మన భవిష్యత్తు పట్ల సమాజంలో జ్ఞానం, అవగాహన, సేవా దృక్పథాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా “గో సేవా విభాగము – తెలంగాణ” ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గో విజ్ఞాన పరీక్షలకు అపూర్వ స్పందన లభిస్తోందని బాల్కొండ ఖండ్ గో సేవా ప్రముఖ్ సల్ల నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా బాల్కొండ లోని పలు ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో గో విజ్ఞాన పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను 2500 కు పైగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఈ పరీక్షలను మొత్తం మూడు దశల్లో లెవెల్ 1: పాఠశాల స్థాయి, లెవెల్ 2: జిల్లా స్థాయి, లెవెల్ 3: రాష్ట్ర స్థాయి పరీక్షను హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
భారీ నగదు బహుమతులు – ప్రశంసా పత్రాలు:
రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన విజేతలకు భారీ బహుమతులు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రథమ బహుమతి : 1,00,000/- (లక్ష రూపాయలు)
ద్వితీయ బహుమతి: 50,000/- (యాభై వేల రూపాయలు)
తృతీయ బహుమతి : 25,000/- (ఇరవై ఐదు వేల రూపాయలు) దీంతో పాటు, పరీక్ష రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి “గో సేవా విభాగం – తెలంగాణ” వారి తరఫున ప్రశంసా (సర్టిఫికెట్) అందజేయనున్నట్లు తెలిపారు. మన భారతీయ గో సంస్కృతి భావి తరాలకు అందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని, ఆరవ తరగతి ఆపై చదువుతున్నా విద్యార్థులు 10 సంవత్సరాల పైనున్న సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.