ఆర్మూర్:రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవలే ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ కు అదేవిధంగా ఎన్నో సేవలు అందిస్తూ అందరికి స్ఫూర్తిగా నిలిచి ఇటీవలే ప్రైడ్ ఆఫ్ ఇండియా జాతీయ పురస్కారం అందుకున్న ఆర్మూర్ పట్టణ సామాజిక సేవకులు,రక్షా సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి పట్వారి తులసి కుమార్ లను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఖాందేష్ శ్రీనివాస్,కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఖాందేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని విద్యా హై స్కూల్ అధినేత ప్రవీణ్ పవార్ అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు,మండలంలో విద్యాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.అదేవిధంగా పట్వారి తులసి సేవలు మన ముందు తరాలకు స్ఫూర్తిగా నిలిచే విధంగా సేవలు అందించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావాలని వారికి మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో రక్షా స్వచ్చంద సేవా సంస్థ ఉపాధ్యక్షులు జింధం నరహరి,ఎస్ జి శ్రీకాంత్,కోశాధికారి గొనె శ్రీధర్,కార్యనిర్వహక కార్యదర్శులు డాక్టర్ బేతు గంగాధర్,ఖాందేష్ సత్యం,మక్కల సాయినాథ్,సభ్యులు గోక శరత్,శ్రీను రాజేష్,ఖోడే శ్రీనివాస్,సదమస్తుల విష్ణు,నరేశ్,దీపక్,చైతన్య,సంజీవ్,సన్నీ తదితరులు పాల్గొన్నారు.
వివిధ రంగాల్లో రాణిస్తున్న రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ సభ్యులకు ఘన సన్మానం…




