గో విజ్ఞాన పరీక్షలకు అపూర్వ స్పందన-2500 కు పుస్తకాల పైగా పంపిణీ
బాల్కొండ :మన గోవులు, మన సంస్కృతి మరియు మన భవిష్యత్తు పట్ల సమాజంలో జ్ఞానం, అవగాహన, సేవా దృక్పథాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా "గో సేవా విభాగము - తెలంగాణ" ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గో విజ్ఞాన పరీక్షలకు అపూర్వ స్పందన లభిస్తోందని బాల్కొండ ఖండ్ గో సేవా ప్రముఖ్ సల్ల నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా బాల్కొండ లోని పలు ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో గో విజ్ఞాన పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను 2500 కు పైగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ పరీక్షలను మొత్తం మూడు దశల్లో లెవెల్ 1: పాఠశాల స్థాయి, లెవెల్ 2: జిల్లా స్థాయి,...