ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ పద్మశాలి కళ్యాణ మండపం ఆధ్వర్యంలో పద్మశాలి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అతిథులను ప్రత్యేకంగా పద్మశాలి కండువాను ధరింపజేసి సభాధ్యక్షులు వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. భారతరత్న స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత విశేషాలతో రిటైర్డ్ టీచర్ జింధం నరహరి రూపొందించిన “జీవన తరంగాలు” అనే కరపత్రాన్ని జిల్లా పద్మశాలి హాస్టల్ అధ్యక్షులు దీకొండ యాదగిరి, జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పూల్గం హన్మాండ్లు ఆవిష్కరించారు. తర్వాత సభాధ్యక్షుల స్వాగతం ఉపన్యాసంలో బిజ్జు దత్తాద్రి మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డలుగా ఉపాధ్యాయులుగా విద్యా రంగానికి అంకితభావంతో ఎనలేని సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.పద్మశాలి కుల బాంధవులు మందరము ఐకమత్యంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చన్నారు.కళ్యాణ మండపం అసంపూర్తి పనుల గురించి మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా మీ సలహాలు సూచనలు సహకారం అవసరమని మీరంతా కళ్యాణ మండపంలో 50 వేల విలువైన షేర్లు పొంది,వాటా పొందాలని,కళ్యాణ మండపం భవిష్యత్ కార్యక్రమాన్ని మీరు చూసుకోవాలన్నారు.
ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి,దీకొండ యాదగిరి,పూల్గం హన్మాండ్లు,ఆర్థోపెడిక్ డాక్టర్ ప్రకాష్,మ్యాక మోహన్ దాస్,విజయ సారథి,యజ్ఞేశ్,దాసరి సునీల్ కుమార్,బొడ్డు గంగాధర్,5వ వార్డ్ కౌన్సిలర్ బండారి శాల ప్రసాద్,చెన్న రవి,అంబల్ల శ్రీనివాస్ లు మాట్లాడుతూ విద్యార్థుల విజయాల వెనుక నిలిచిన మీ త్యాగానికి,సమాజ అభ్యున్నతికి మీరు చేస్తున్న కృషికి అభినందనలు తెలుపుతూ…శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు.భవిష్యత్ తరాల కొరకు నిర్మించిన ఈ పద్మశాలి కళ్యాణ మండపానికి మీ చేయూత అవసరమన్నారు. ఉపాధ్యాయుల ప్రతిస్పందనలో పొలాస రాములు,గుండంపల్లి సురేష్ కుమార్,భీమన్ పల్లి నాగేష్ పీడి,రుద్ర రజిత,స్రవంతి మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా మమ్మల్ని సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ,ఈ చక్కటి కార్యక్రమంలో మీకు ఎల్లప్పుడూ అండదండగా ఉంటూ సలహాలు సూచనలు ఇస్తూ సహకరిస్తామన్నారు.తర్వాత జరిగిన సన్మాన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార అవార్డులకు 74 మందిని శాలువాలు,పూలమాలలు,జ్ఞాపికలు,సర్టిఫికెట్స్ తో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా జింధం నరహరి వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణంలోని పట్టణ పద్మశాలి సంఘాల కార్యవర్గ సభ్యులు, 16 సంఘాల అధ్యక్షులు,ఆర్మూర్ మండల గ్రామీణ కుల సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.




