కోటార్మూర్ (ఆర్మూర్) పద్మశాలి కళ్యాణ మండపం అడాహాక్ కమిటీ ఆధ్వర్యంలో “పద్మశాలి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు”…
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ పద్మశాలి కళ్యాణ మండపం ఆధ్వర్యంలో పద్మశాలి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అతిథులను ప్రత్యేకంగా పద్మశాలి కండువాను ధరింపజేసి సభాధ్యక్షులు వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. భారతరత్న స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత విశేషాలతో రిటైర్డ్ టీచర్ జింధం నరహరి రూపొందించిన "జీవన తరంగాలు" అనే కరపత్రాన్ని జిల్లా పద్మశాలి హాస్టల్ అధ్యక్షులు దీకొండ యాదగిరి, జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పూల్గం హన్మాండ్లు ఆవిష్కరించారు. తర్వాత సభాధ్యక్షుల స్వాగతం ఉపన్యాసంలో బిజ్జు దత్తాద్రి మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డలుగా ఉపాధ్యాయులుగా విద్యా రంగానికి అంకితభావంతో ఎనలేని సేవలు అందిస్తున్న...