24.5 C
Hyderabad
Wednesday, September 23, 2026

రెండు పడకల ఇళ్ల కేటాయింపులో అర్హులకు చోటు కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో రెండు పడకల ఇళ్ల కేటాయింపుల్లో అర్హులకు చోటు కల్పించాలని బాల్కొండ మండల కో ఆప్షన్ మాజీ సభ్యుడు షాహిద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సబ్ కలెక్టర్, బాల్కొండ తాసిల్దార్ లకు అందజేశారు. జాబితాలో పలువురు అర్హుల పేర్ల వద్ద ‘ప్రజా పాలన దరఖాస్తు లిస్టులో పేరు లేదు’ అని రిమార్క్‌ చేయడంపై మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు  షాహీద్ ప్రశ్నించారు. ప్రజా పాలన దరఖాస్తులో రెండు పడక గదుల ఇళ్లకు ప్రత్యేక ఆప్షన్ లేనప్పుడు, ఆ కారణంతో అనర్హులుగా పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు.అధికారులు ఈ జాబితాను మరోసారి సమగ్రంగా పరిశీలించి, అర్హత ఉన్న పేద కుటుంబాలకు అన్యాయం జరగకుండా చూడాలని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని షాహీద్ కోరారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.