24.5 C
Hyderabad
Wednesday, September 23, 2026

బాల్కొండలో తాతా మధు, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: శాసనసభ ఆవరణలో ఎమ్మెల్సీ తాతా మధు గారు దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఉద్దేశించి అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించడాన్ని నిరసిస్తూ బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బాల్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు గారి దిష్టిబొమ్మతో పాటు, ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

స్పీకర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైన అత్యున్నత గౌరవనీయమైన పదవి. రాజకీయ భేదాలు ఉండవచ్చు.. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు.. కానీ స్పీకర్ పదవిని, వ్యక్తిగత గౌరవాన్ని, దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా అసభ్య పదజాలం ఉపయోగించడం ఏమాత్రం సమర్థనీయం కాదు.

సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ము లేక..
ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం లేక..
తమ పార్టీ అధినేత అసెంబ్లీకి ఎందుకు హాజరు కావడం లేదో చెప్పలేక..ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న చిల్లర రాజకీయాలు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నాయి.

దళిత స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడటం అంటే కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదు.. అది దళితుల ఆత్మగౌరవాన్ని, రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే అని కాంగ్రెస్ నాయకులు అన్నారు.

ఇలాంటి దురహంకారపూరిత వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన, ప్రజాస్వామ్యపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది — పదవులు, రాజకీయాలు శాశ్వతం కావు.. కానీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సామాజిక గౌరవం శాశ్వతం. వాటిని అవమానించే ఏ శక్తినైనా ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా ఎదుర్కొంటాం.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాట్ల ప్రవీణ్ గారి తో కలిసి సర్పంచులు జిల్లా కార్యవర్గ సభ్యులు మండల కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.