ఆర్మూర్ లో విశ్రాంత ఉద్యోగుల ద్వితీయ కార్యవర్గ సమావేశం…
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెన్షనర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు, జిల్లా కార్యదర్శి కరుణాసాగర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పుష్పకర్ రావు,యూనిట్ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్,ఆర్థిక కార్యదర్శి నవజీవన్,గౌరవాధ్యక్షులు రాం రెడ్డి పాల్గొన్నారు.యూనిట్ కార్యదర్శి జ్ఞానేశ్వర్ కార్యదర్శి నివేదికను చదివి వినిపించారు.ఆర్థిక కార్యదర్శి నవజీవన్ ఆర్థిక నివేదికను చదివి వినిపించారు.హాజరైన సభ్యుల చప్పట్లతో రెండు నివేదికలను ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా సభాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విశ్రాంత...