Friday, May 22, 2026

కిసాన్ నగర్ గ్రామంలో ఇండ్ల గణనను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అడిషనల్ చార్జ్ ఆఫీసర్ బట్టు రాజేశ్వర్

📰 Generate e-Paper Clip

బాల్కొండ: ఇండ్ల గణన (హౌస్ లిస్టింగ్) ప్రక్రియలో భాగంగా, ఆదివారం అడిషనల్ చార్జ్ ఆఫీసర్ మరియు మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ కిషన్ నగర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేపట్టారు. వారు ప్రతి ఇల్లు, కుటుంబాల వివరాల నమోదు, మొబైల్ యాప్‌ల పనితీరు, మరియు గణకులు ఎన్యూమరేటర్లు నిబంధనల ప్రకారం పనిచేస్తున్నారా లేదా అని పరిశీలించారు. మ్యాపింగ్ మరియు బ్లాక్స్: చార్జ్ ఆఫీసర్లు తమ పరిధిలోని ఇండ్లను బ్లాక్‌లుగా సరిగ్గా విభజించారో లేదో పరిశీలించారు.

డిజిటల్ నమోదు: జనగణన పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుండటంతో, ఎన్యూమరేటర్లు తమ మొబైల్ యాప్ ద్వారా డేటాను సేకరించడాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.ఇండ్ల గణన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, ప్రతి ఇంటినీ కచ్చితంగా లెక్కించేలా చూడాలని సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. గణన ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు ఉంటే, సదరు సూపర్వైజర్లు ఎన్యుమరేటర్లు తనను సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో కిషన్ నగర్ గ్రామ సర్పంచ్ రామరాజు గౌడ్ ,సూపర్వైజర్ మాలెం సాయన్న ,ఎన్యుమరేటర్లు రాజారపు కీర్తి, రమాదేవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు .

Must Read
- Advertisement -
Latest News

అడిషనల్ డీసీపి శుభం ప్రకాష్ ను కలిసిన సమాజ సేవకుడు పట్వారి తులసి కుమార్

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన అడిషనల్ డీ. సీ. పి శుభమ్ ప్రకాష్ ని ఆర్మూర్ పట్టణ జాతీయ...

More Articles Like This