Sunday, June 28, 2026

ఘనంగా జాన్కంపేట్ చర్చి 7వ వార్షికోత్సవం

📰 Generate e-Paper Clip

 


వేల్పూర్: మండలం జాన్కంపేట్ గ్రామంలో ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ 7వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగాయి.చిన్నపిల్లలు, యువతీ యువకులు ప్రత్యేక పాటలు పాడారు.గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాల నుంచి వచ్చిన క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి.ఈ సందర్భంగా సిద్దిపేట్ సీనియర్ పాస్టర్ ప్రకాష్, నార్సింగ్ ఐబీసీ ప్రెసిడెంట్ పాస్టర్ సోలోమోను రాజ్ ఇరువురు దైవ మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ద్వారానే పరలోక ప్రాప్తి ఉంటుందని ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తు లాంటి పరిశుద్ధతను కలిగి ఉండాలని వారు చెప్పారు. మందిరం మానవుల కోసమని మానవులు దేవుని కోసమని అన్నారు.ఏసుక్రీస్తు లాంటి ప్రవర్తన కలిగి ఈ లోకానికి ఆదర్శంగా ఉండాలని తెలిపారు. సాటి మానవుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని అప్పుడే సమాజంలో శాంతి,సహనం ఏర్పడి మానవులంతా దేవుని ప్రేమకు పాత్రులుగా ఉంటారని సందేశం వినిపించారు.అనంతరం పాస్టర్లు ప్రకాష్, సల్మాన్ రాజ్, ఆర్మూర్ భీమ్గల్ ఇతర మండలాల నుంచి వచ్చిన పాస్టర్లను ఐబీసీ తరఫున పాస్టర్ నోవా, సంఘ పెద్దలు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జాన్కంపేట్ క్రైస్తవ భక్తులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This