ఘనంగా జాన్కంపేట్ చర్చి 7వ వార్షికోత్సవం
వేల్పూర్: మండలం జాన్కంపేట్ గ్రామంలో ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ 7వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగాయి.చిన్నపిల్లలు, యువతీ యువకులు ప్రత్యేక పాటలు పాడారు.గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాల నుంచి వచ్చిన క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి.ఈ సందర్భంగా సిద్దిపేట్ సీనియర్ పాస్టర్ ప్రకాష్, నార్సింగ్ ఐబీసీ ప్రెసిడెంట్ పాస్టర్ సోలోమోను రాజ్ ఇరువురు దైవ మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ద్వారానే పరలోక ప్రాప్తి ఉంటుందని ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తు లాంటి పరిశుద్ధతను కలిగి ఉండాలని వారు చెప్పారు. మందిరం మానవుల కోసమని మానవులు దేవుని కోసమని అన్నారు.ఏసుక్రీస్తు లాంటి ప్రవర్తన కలిగి ఈ లోకానికి...