Sunday, June 28, 2026

పౌర్ణమి వెలుగుల్లో ఘనంగా పల్లకి సేవ

📰 Generate e-Paper Clip

మెండోరా:మెండోరా మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా స్వామివారిని శోభాయమానంగా అలంకరించి పల్లకిలో ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణగా తీసుకెళ్లగా, భక్తులు భారీగా పాల్గొని హారతులు సమర్పించారు. దేవాలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.పౌర్ణమి వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This