Sunday, June 28, 2026

చదువుతోపాటు ఆత్మ రక్షణ కొరకు కరాటే నేర్చుకోవాలన్న… కరాటే గ్రాండ్ మాస్టర్ భోజన్న …

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణానికి చెందిన కరాటే గ్రాండ్ మాస్టర్ భోజన్న, రిటైర్డ్ టీచర్ సేవలు నిజంగా అభినందనీయం.చిన్నారులలో ఆత్మస్థైర్యాన్ని క్రమశిక్షణను ధైర్య సాహసాలను పెంపొందించడానికి ఆయన చేస్తున్న ఈ “ఉచిత కరాటే శిక్షణ “ఒక మహోన్నత సేవా యజ్ఞంగా సమాజంలో నిలుస్తుంది.

కరాటే గ్రౌండ్ మాస్టర్ భోజన్న మాట్లాడుతూ పిల్లలు శారీరకంగా బలంగా ఉండటమే కాదు,మానసికంగా కూడా దృఢంగా ఎదగడానికి కరాటే ఎంతో సహాయపడుతుందని,ఈ విద్య ద్వారా వారు స్వీయరక్షణతో పాటు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే నైపుణ్యాన్ని  పొందగలుగుతారన్నారు.

సమాజానికి మంచి పౌరులను తీర్చిదిద్దే దిశగా కరాటే భోజన్న సేవలు ఆదర్శప్రాయమైనవి. ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత మంది ప్రేరణగా తీసుకొని,ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. “పిల్లల భవిష్యత్తు బలంగా ఉండాలంటే వారి ఆత్మస్థైర్యమే పునాది” అనే సందేశాన్ని కార్యరూపంలో చూపిస్తున్న కరాటే గ్రాండ్ మాస్టర్ భోజన్న రిటైర్డ్ టీచర్ ను పలువురు పిల్లల తల్లిదండ్రులు అభినందిస్తూ వారి సేవలను కొనియాడుతున్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This