చదువుతోపాటు ఆత్మ రక్షణ కొరకు కరాటే నేర్చుకోవాలన్న… కరాటే గ్రాండ్ మాస్టర్ భోజన్న …
ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణానికి చెందిన కరాటే గ్రాండ్ మాస్టర్ భోజన్న, రిటైర్డ్ టీచర్ సేవలు నిజంగా అభినందనీయం.చిన్నారులలో ఆత్మస్థైర్యాన్ని క్రమశిక్షణను ధైర్య సాహసాలను పెంపొందించడానికి ఆయన చేస్తున్న ఈ "ఉచిత కరాటే శిక్షణ "ఒక మహోన్నత సేవా యజ్ఞంగా సమాజంలో నిలుస్తుంది. కరాటే గ్రౌండ్ మాస్టర్ భోజన్న మాట్లాడుతూ పిల్లలు శారీరకంగా బలంగా ఉండటమే కాదు,మానసికంగా కూడా దృఢంగా ఎదగడానికి కరాటే ఎంతో సహాయపడుతుందని,ఈ విద్య ద్వారా వారు స్వీయరక్షణతో పాటు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే నైపుణ్యాన్ని పొందగలుగుతారన్నారు. సమాజానికి మంచి పౌరులను తీర్చిదిద్దే దిశగా కరాటే భోజన్న సేవలు ఆదర్శప్రాయమైనవి. ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత...