ఆర్మూర్: నాణ్యమైన పసుపు పంట రైతుకు మంచి ఆదాయం ఇవ్వగలిగే ముఖ్యమైన పంటల్లో ఒకటి. పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధ గుణాలు కలిగి ఉండటం వల్ల మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అందువల్ల సరైన పద్ధతుల్లో పసుపు సాగు చేస్తే అధిక దిగుబడి తో పాటు మంచి లాభాలు పొందవచ్చు. మెండోరా గ్రామంలో కార్విన్ అగ్రి సైన్స్ కంపెనీ వారి ఉత్పత్తులు వాడి అధిక దిగుబడులు పొందిన రైతన్నలకు కంపెనీ ప్రతినిధులు దోండి రమణ శాలువాతో మెమొంటోలతో ఘనంగా సన్మానించినారు. ఇట్టి కార్విన్ కంపెనీ వారి సాయిల్ పవర్ కిట్ వాడి అధిక దిగుబడులు తీసిన అల్లూరి గంగారెడ్డి తుమ్మల గంగాధర్ రెడ్డి ఏనుగు లింగారెడ్డి నూతపల్లి లింగారెడ్డి కొప్పుల ముత్యంరెడ్డి భూక్య సంతోష్ ఏనుగు శంకర్ రెడ్డి, శ్రీనివాస్ బడల సాయి రెడ్డిలు మాట్లాడుతూ పసుపు నాణ్యత కొమ్మురడం మంచి కురుకుమిన్ శాతం పెరగడం దుంపుకుళ్ళు నివారణ తదితర విషయాలపై వాళ్ళ అభిప్రాయాలు ఇట్టి కార్యక్రమంలో పంచు కుంటూ ఇంత మంచి ఉత్పత్తులను అందించిన కార్విన్ కంపెనీ వారికి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం రైతు డిపో కృష్ణవంశీ అధ్యక్షతన కార్వింగ్ కంపెనీ ప్రతినిధి దోండి రమణ,నవీన్ఆ,సిఫ్ తదితరులు పాల్గొన్నారు.



