Thursday, May 14, 2026

వన్నెల్ (కే) గ్రామంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ…

📰 Generate e-Paper Clip

ఆర్మూర్: నందిపేట్ మండలంలోని వన్నెలకే గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని,మధ్య దళారులతో మోసపోవద్దని, ప్రజల కష్ట,సుఖాలకు అండగా ఉంటానని అన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మెప్పించి, ఒప్పించి కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు ఒక తులం బంగారం కూడా ఇప్పించమని ఎమ్మెల్యేను ప్రాధేయపడ్డారు.ఈ కార్యక్రమంలో బీజేపి గ్రామ అధ్యక్షులు రాయికంటి భరత్ రెడ్డి,బీజేపి కార్యకర్తలు, లబ్ధిదారులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This