ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఘనంగా “Sports & Cultural Day” ను నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. వేణుగోపాల స్వామి తెలిపారు. కళాశాలలో జరిగిన Sports & Cultural Day కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ. జె. వెంకటేశ్వర్ రెడ్డి, ACP, ఆర్మూర్ హాజరైనారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ. జె. వెంకటేశ్వర్ రెడ్డి, ACP విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో చురుకుగా పాల్గొనాలని, క్రమశిక్షణ, వైఫల్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎంతో అనుభవజ్ఞులైన అధికారులు బోధించిన అంశాలు, వారి యొక్క గైడెన్స్ ను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా శ్రీ. కె. విద్యాసాగర్, Traffic and Road Safety Wing, ఆర్మూర్ విచ్చేసి విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.
అదే విధంగా గత సంవత్సరం B.Sc, BA, B.Com Group Toppers గా నిలిచిన విద్యార్థులకు, వివిధ జాతీయస్థాయి కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు మెమెంటోలు, Certificates ను ప్రదానం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డా. వై. వేణుప్రసాద్, డా. ఎం. సునీత, డా. అంబర్ సింగ్, డా. ఎస్. జాన్ సుకుమార్, Incharge PD శ్రీ. బి. వెంకటేశ్వర్లు, Cultural Coordinator అబ్దుల్ రహ్మాన్, డా. జి. లింగన్న, డా. శ్యాం కుమార్, డా. వజీరా భాను, ఇ. రాజ్‌కుమార్, యాదగిరి, Senior Assistant శ్రీమతి స్వరూప రాణి, అధికారులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



