ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ కల్చర్ డే…
ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఘనంగా "Sports & Cultural Day" ను నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. వేణుగోపాల స్వామి తెలిపారు. కళాశాలలో జరిగిన Sports & Cultural Day కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ. జె. వెంకటేశ్వర్ రెడ్డి, ACP, ఆర్మూర్ హాజరైనారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ. జె. వెంకటేశ్వర్ రెడ్డి, ACP విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో చురుకుగా పాల్గొనాలని, క్రమశిక్షణ, వైఫల్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎంతో అనుభవజ్ఞులైన అధికారులు బోధించిన అంశాలు, వారి యొక్క గైడెన్స్ ను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని...