Sunday, June 28, 2026

టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు అందించిన ఎండీ వై నాగిరెడ్డి -ఉచితంగా రూ.10 లక్షల ఇన్సూరెన్స్

📰 Generate e-Paper Clip

టీజీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగుల భద్రత విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఎస్ఆర్టీసీలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం చెందిన ఉద్యోగులకు ఉచితంగా రూ.10 లక్షలు బీమా అందించాలని నిర్ణయించింది.

టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి చేసిన ప్రత్యేక సూచనల మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగిన ఆర్టీసీ సిబ్బందికి సామాజిక భద్రతను మరింత పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు మాత్రమే వర్తిస్తున్న బీమా సౌకర్యాన్ని, ఇప్పుడు సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా సంస్థలో పనిచేస్తున్న దాదాపు 38వేల పైగా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కలగనుంది .

రూ. 10 లక్షల ఆర్థిక భరోసా…
యూనియన్ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగి సహజంగా మరణించినా…వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందుతుంది.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This