Saturday, June 13, 2026

డాక్టర్లు లేరు…. ఎండలకు మందులు మాడి పోతున్నాయి! వెల్ నెస్ సెంటర్ పై ఇంత నిర్లక్ష్యమా! అధికారుల తీరుకు నిరసనగా ఏప్రిల్ 10( శుక్రవారం) వెల్ నెస్ సెంటర్ ఎదురుగా ఆల్ పెన్షనర్ల ధర్నా

📰 Generate e-Paper Clip

ఆర్మూర్:జిల్లా కేంద్రంలోని వెల్ నెస్ సెంటర్ ముందు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి…ఎంతో ప్రతిష్టాకరంగా ఉద్యోగుల, పెన్షనర్లు, జర్నలిస్టులకు ఓ.పి సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వెల్ నెస్ సెంటర్ అధికారుల నిర్లక్ష్యానికి బలవుతోంది డాక్టర్లు లేక… ఎండలకు మందులు
మాడి పోతున్నాయి .సరైన టెంపరేచర్ లో మందులు లేని కారణంగా అవి పని చేస్తున్నాయో లేదో అర్థం కావటం లేదు.అనేకసార్లు డాక్టర్లను నియమించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు మరియు జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి ప్రయోజనం జరగలేదు. ఉన్న ఇద్దరు డెంటల్ డాక్టర్లు కూడా పేషంట్ల ఒత్తిడికి తట్టుకోలేక వారు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. స్పెషలిస్టు డాక్టర్లు లేకపోయినా రోజువారి మందులు రాసేందుకు ఎంబిబిఎస్ డాక్టర్లు కూడా లేని కారణంగా పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు గంటల తరబడి వెల్నెస్ సెంటర్ నందు పడి గాపులు కాయాల్సి వస్తోంది. వెల్నెస్ సెంటర్ ప్రస్తుతం పాత మున్సిపల్ కార్పొరేషన్ వెనుక రేకుల షెడ్డులో నడుస్తుంది. రోజు రోజుకీ పెరుగుతున్న ఎండల మూలంగా మందులు వేడెక్కుతున్నాయి పాడైపోతున్నాయి. అవి పని చేస్తాయో లేదో అనే అనుమానం కలుగుతుంది.మన సంఘము యొక్క కృషి ఫలితంగా మరొక షెడ్డు నిర్మాణానికి మున్సిపల్ కార్పొరేషన్ వారు ప్రారంభించారు. అది ఎప్పటికీ పూర్తవుతుందో తెలియటం లేదు. వెల్ నెస్ సెంటర్లోని మందులతో పాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మహిళలకు వాష్ రూమ్ లు కూడా లేవు. లబ్ధిదారులు ఎండలోనే నిలబడి తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు
మందులు తీసుకునేటప్పుడు కూడా ఇదే పరిస్థితి. సీనియర్ సిటిజెన్లు అయిన పెన్షనర్లు చాలా దూరం నుండి వచ్చి మందుల కోసం ఎదురుచూస్తున్నారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అందుకే వెంటనే డాక్టర్లను నియమించాలని, వెల్నెస్ సెంటర్ ను పటిష్ట పరచాలని, మందులు వేడికి పాడవకుండా ఏసీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ *ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు వెల్నెస్ సెంటర్ ఎదురుగా ధర్నా* చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ నిర్ణయించింది. ఎంతో కీలకమైన, మన ఆరోగ్యానికి సంబంధించిన *వెల్ నెస్ సెంటర్*పనితీరు బాగు పడేలా అందరూ కృషి చేయాలని, కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

Must Read
- Advertisement -
Latest News

ఎన్ ఎఫ్ బి ఎస్ క్రింద 20 వేల రూపాయలు మంజూరు

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. NFBS. పథకంలో మంజూరైన 20000/-వేల రూపాయల ప్రొసిడింగ్ కాఫీని  స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జలాల్పూర్ గ్రామానికి చెందిన ...

More Articles Like This