Monday, June 15, 2026

యూరియా యాప్ లో ఇబ్బందులు తొలగించాలి

📰 Generate e-Paper Clip

బాల్కొండ: యూరియా యాప్ ద్వారా రైతులు ఎదురుకుంటున్న సమస్యల సందర్బంగా బాల్కొండ మండల భారతీయ జనతాపార్టీతరుపున మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో బాల్కొండ ఎం. ఆర్. ఓ శ్రీనివాస్ కు మెమోరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి  పాల్గొని మాట్లాడుతూ యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా యూరియా ఆప్ వల్ల రైతులకు యాప్ లో ఎలా బుక్ చేయాలో అర్థం కాకా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే యూరియా ఆఫ్ లోని రైతులకు మరింత సులువు అయ్యే విధంగా మార్పులు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగే రైతులకు సకాలంలో యూరియా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని యూరియా ఆప్ ని ప్రతి రైతుకు సులువుగా ఉండే విధంగా రూపొందించి ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో తీసుకురావాలన్నారు.

ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఆరెపల్లి నర్సయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు తోట చిన్నయ్య, బీజేపీ మం ప్రధానకార్యదర్శి జమిలి గిరి సాయికిరణ్, ఓబీసీ మోర్చా మం, అధ్యక్షులు కళ్లెం సుధాకర్, వార్డు మెంబర్ ఉట్నూర్ రాంకిషన్, బీజేపీ మండల నాయకులు అంగారి రాజలింగం, ఆరెపల్లి రవీందర్, తోట నాగేష్, ఏద్దండి నర్సయ్య, కడ్తల్ రాజేశ్వర్,అంబటి గంగాధర్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

ఎన్ ఎఫ్ బి ఎస్ క్రింద 20 వేల రూపాయలు మంజూరు

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. NFBS. పథకంలో మంజూరైన 20000/-వేల రూపాయల ప్రొసిడింగ్ కాఫీని  స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జలాల్పూర్ గ్రామానికి చెందిన ...

More Articles Like This