డాక్టర్లు లేరు…. ఎండలకు మందులు మాడి పోతున్నాయి! వెల్ నెస్ సెంటర్ పై ఇంత నిర్లక్ష్యమా! అధికారుల తీరుకు నిరసనగా ఏప్రిల్ 10( శుక్రవారం) వెల్ నెస్ సెంటర్ ఎదురుగా ఆల్ పెన్షనర్ల ధర్నా
ఆర్మూర్:జిల్లా కేంద్రంలోని వెల్ నెస్ సెంటర్ ముందు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి...ఎంతో ప్రతిష్టాకరంగా ఉద్యోగుల, పెన్షనర్లు, జర్నలిస్టులకు ఓ.పి సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వెల్ నెస్ సెంటర్ అధికారుల నిర్లక్ష్యానికి బలవుతోంది డాక్టర్లు లేక... ఎండలకు మందులు మాడి పోతున్నాయి .సరైన టెంపరేచర్ లో మందులు లేని కారణంగా అవి పని చేస్తున్నాయో లేదో అర్థం కావటం లేదు.అనేకసార్లు డాక్టర్లను నియమించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు మరియు జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి ప్రయోజనం జరగలేదు. ఉన్న ఇద్దరు డెంటల్ డాక్టర్లు కూడా...