Thursday, May 14, 2026

 శ్రీ నిమిషంభ దేవి ఆలయంలో పూజలు – అన్నదానం

📰 Generate e-Paper Clip

“అలకొండ పురి రమ్య నగై:
నవబి రావృతా ! తత్రేషా తు మహాదేవి నిమిషాంబా ప్రతి ష్ఠితా : !! (తొమ్మిది ఏతైనా నల్ల రాల్ల కొండల చేత చుట్టబడి ఉన్న అందమైన అల్లకుండ,వల్లకొండ, @ బాల్కొండ అనే గ్రామంలో మహా శక్తి అయిన శ్రీ నిమిషంబ దేవత పూర్వములోనే ప్రతిష్టించ బడినది)కుమారి బ్రహ్మ రౌతు
సంయుక్త పుట్టిన రోజు సంద ర్బంగా శ్రీ నిమిషంబ దేవి అల్ల కొండలోని అమ్మ వారి సేవలో అమ్మవారికి అభిషేకం తో పాటు విశేష పూజలు జరిగాయని ఆలయ పూజారి బి. కృష్ణ రావు జోషి తెలిపారు.ఏప్రిల్ నెల టోకెన్ నం (74) అన్నదానాన్ని బాల్కొండ కు చెందిన శ్రీ నిమి షంభ దేవి సేవకులైన వశిష్ఠ మహాముని గోత్రానికి చెందిన బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు కుటుంబంలోని నర్సింగ్ రావు, మణెమ్మ మానే రావు, శ్రవణ్ కూమార్, శిరీష,బి. ఆర్. సంయుక్త, బి.శాత్విక,లింబష్, పావని సుధా,నరేష్ కుమార్, ప్రణతి, సమీక్షా, బి. ఆర్. నర్సింగ్ రావు తల్లి గారి రూపంతో పాటు పూర్వ దైనందిన అలవాట్లతో మల్లి బి. ఆర్. సమీక్షా జన్మించిన సందర్బంగా ఆలయంలో అన్న దానం చేశారని పూజారి బి కృష్ణ రావు తెలిపారు. శుక్రవారం రోజు జరిగిన పూజ కార్యక్రమాల్లో ఆది లాబాద్, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల నుండి భక్తులు హాజరై అమ్మ వారికి ఒడి బియ్యలు సమర్పించు కున్నారు. అమ్మవారి సేవల్లో భాగంగా వంట వార్పు కార్యక్రమంలో బి. సత్యనారా యణ,బి.లింబేష్,బి. శ్రీనివాస్, బి.జనార్దన్, బి. నరేష్, బి.గంగా ధర్ (చౌదరి), శ్రీమతి బి. ఆర్. మణెమ్మమానే రావు,బి. ప్రణతి, బి. సునీత,బి. జయచిత్ర, బి. భవాని,బి. పోసాని, బి. పప్పి,బి. గోపి,, సత్వావే సంతోష్ కుమార్, ఏం. నాగేశ్వర్, పోలకొండ శ్రీకాంత్,జమున,స్వాతి తది తరులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా అన్న దానం మహా దానం,నిత్యం చేస్తే పుణ్యఫలం, అన్నం లేనివారికి, దానం చేయడం మానవ ధర్మం, అని ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం నిత్యం దేవుని సేవించడం ఒకటే అని ఆలయ సేవకులు బి. ఆర్. నర్సింగ్ రావు ఈ సందర్బంగా భక్తులకు వివరించారు.మానవ జన్మ నెత్తి ఎంత సoపాధించా వనేది కాదని శ్రీ నిమిషంబ దేవికి ఏం చేశావ నేది ముఖ్యమని,అలాగే సమాజం నీకేo ఇచ్చిందని కాదు, సమాజా నికి నీవేం చేశావానేది ముఖ్యం మని అయన భక్తులకు వివరిం చారు.

భక్తులకు విజ్ఞప్తి

ఈ నెల 26 ఆదివారం అమ్మ వారి జన్మ దినం సందర్బంగా అన్నదానం ఆలయo ద్వారా నిరహిస్తామని అలాగే మే నెల టోకెన్ నెం (75) మొదటి శుక్రవారం తేదీ 01-05-2026 న నిర్మల్ జిల్లా సారంగాపూర్ కు చెందిన కె. రాజేందర్ రెడ్డి దంపతుల మే నెలలో వివాహ సందర్బంగా అమ్మవారికి ఒడి బియ్యం తో పాటు అన్నదానం చేస్తున్నారని అలాగే జూన్ నెల 2026,టోకెన్ నం (76) మొదటి శుక్రవారం నుండి డిసెంబర్ 2026 నెల టోకెన్ నం (82) వరకు ప్రతి నెల మొదటి శుక్రవారాల్లో అన్నదానం చేయాలనుకునే కుటుంబాలు తమ కుటుంబ పేర్లు, గోత్రాలు మరియు కుటుంబ సమూహక గ్రూవ్ ఫోటోలతో 9666759297 నంబర్‌కు ఫోన్ చేసి టోకెన్ నంబర్ పొందాలని ఆలయ సేవకులు కోరుచున్నారు.అలాగే
శ్రీ నిమిషంబ దేవి అమ్మకు – సేవ చేయడానికి పెద్దరికానికి పద వులు అవసరం లేదని – అమ్మ సేవ చేయడానికి అమ్మ అజ్ఞా ఉండాలే తప్ప పదవులు ముఖ్యం కాదని, ఇందులో భాగంగానే 2001 నుండి ఈ అమ్మవారికి అందరూ సేవలు చేసుకోవచ్చని ఆలయ సేవకు లైన బి.ఆర్. నర్సింగ్ రావు, బి.గంగా ధర్ (చౌదరి), బి.సత్య నారాయణ,బి, చిన్న గంగాధర్, బి. గోపి, జనార్దన్ (వెంకమ్మ )బి. జగదీశ్వర్, బి. రాహుల్,బి శ్రీనివాస్,బి.వరుణ్,బి.నరేష్,బి.కమల్, బి.మనోజ్, మరియు బి.నితిన్,అమ్మ సేవకూలమైన మేము సమిష్టితో ఉత్తర / దక్షిణ సింహ ద్వారం చేయించ డానికి ముందుకు వెళ్తున్నామని ఈ మంచి కార్యక్రం లో శ్రీ నిమి షంబదేవి భక్తులు ఎవరైనా ఉంటె ఆలయ సేవకు లుగా “ఒక టీం” గ ఏర్పడి నిధులు జమ చేసుకొని మీ వద్దనే ఉంచుకొని ఖర్చుల్లో భాగస్వా ములు కాగలరని వారు సంయు క్తంగా విజ్ఞప్తి చేసారు.

ఈ క్షేత్రానికి ఏలా చేరుకోవాలి

నిజామాబాద్ జిల్లా బాల్కొండలో కొలువై ఉన్న శ్రీ నామిషంభ దేవి హైదరాబాద్ పట్టణానికి 200 కిలోమీటర్ దూరంలో హైదరా బాద్ – నాగపూర్ జాతీయ రహదారి పై బాల్కొండ ఉంది.అతి సమీ పంలో ఆసియ ఖండం లో నే వెడల్పు అయినా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 8 కి.మీ. దూరంలో కలదు.పవిత్ర శక్తి పీఠాలలో ఉత్తమ మైన శక్తి స్వరూపిణి అయిన శ్రీ నిమిషంబ దేవి అమ్మ వారిని దర్శించుకుని జీవన ముక్తి పోదాలని అసిసద్దామా ….మరి.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This