26.7 C
Hyderabad
Tuesday, September 22, 2026

స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం…

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో పెర్కిట్ లోని బొర్ర గణపతి దేవాలయం వద్ద మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా స్ఫూర్తి సేవా సొసైటీ అధ్యక్షులు రాస ఆనంద్,వీడీసి అధ్యక్షలు కామని రామకృష్ణ,రాజేందర్, శ్రీనివాస్,స్థానిక సభ్యులు రఘునాథ్ పాల్గొని,ప్రభాకర్ రావు పూజారి దీవెనలతో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా స్ఫూర్తి సేవా సొసైటీ అధ్యక్షులు రాస ఆనంద్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి 150 మట్టి గణపతి విగ్రహాలను బొర్ర గణపతి ఆలయంలో “వినాయక చవితి” పండగ సందర్భాన్ని పురస్కరించుకొని,పంపిణీ చేశామన్నారు.

ప్రజల అధిక సంఖ్యలో వచ్చి మట్టి గణపతులను తీసుకెళ్లారు.మట్టి గణపతుల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లదని,పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.ఈ సందర్భంగా మట్టి గణపతి ప్రాముఖ్యతను,పీవోపి గణపతుల వల్ల కలిగే నష్టాలను ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు రఘునాథ్ వివరించారు.తర్వాత స్ఫూర్తి సేవా సొసైటీ అధ్యక్షులు రాస ఆనంద్ ను వీడీసి సభ్యులు, ప్రభాకర్ రావు పంతులు ఆధ్వర్యంలో శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.