మైనార్టీ తాత్కాలిక కమిటీలు రద్దు.. కొత్త కమిటీల ఏర్పాటుకు కసరత్తు
మెండోరా: మెండోరా మండలంలోని గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలకు డీసీసీ ఆమోదం తెలిపింది. డీసీసీ అధ్యక్షుడు కె. నాగేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బడాల సాయిరెడ్డితో సంప్రదింపుల అనంతరం నియామకాలు అమల్లోకి వచ్చాయి. బుస్సాపూర్–జక్కుల రాజన్న, ఎస్సారెస్పీ–కిరణ్, సోన్‌పేట్–మల్కేష్, దూదిగాం–బోలిశెట్టి సాగర్, చాకిర్యాల్–దేవేందర్, మెండోరా–నోముల రాజన్న, కోడిచెర్ల–కొమ్ముల దేవేందర్, వెల్గటూర్–అంజయ్య, సావెల్–లక్ష్మణ్, నెహ్రూనగర్–ధన్‌రాజ్, నడిమితండా–వినోద్‌లను అధ్యక్షులుగా నియమించారు.
ఇదిలా ఉండగా, మండలంలోని కాంగ్రెస్ అనుబంధ మైనార్టీ విభాగాల తాత్కాలిక కమిటీలను రద్దు చేసినట్లు బడాల సాయిరెడ్డి తెలిపారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు త్వరలో కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు.పోచంపాడ్ అతిథి గృహంలో జరిగిన కార్యక్రమంలో నూతన గ్రామ అధ్యక్షులకు జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ నోముల శ్రీనివాస్, బడాల సాయిరెడ్డి నియామక పత్రాలు అందజేశారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నోముల శ్రీనివాస్ సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రొట్టె సంతోష్, చందు, రమేష్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.
మెండోరాలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం




